ఎర్రకోట పేలుడు బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో గాయపడిన బాధితులను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. ఆయన సోమవారం రాత్రి LNJP ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న బాధితులను కలిశారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి వివరంగా అడిగి తెలుసుకున్నారు.
ప్రధాని మోదీ, ఆస్పత్రిలోని వైద్య బృందంతో సమావేశమై, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నా సూచనలు ఇచ్చారు.
గుర్తుచేయదగిన విషయం ఏమిటంటే, ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన భారీ పేలుడులో 12 మంది పౌరులు మృతిచెందగా, మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.

