నవంబర్ 12న మోదీ తెలంగాణ టూర్
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12న తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)ను జాతికి అంకితం చేస్తారు. అనంతరం ఎన్‌టీపీసీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సత్తుపల్లి – కొత్త గూడెం రైల్వే లైన్‌ను అధికారికంగా ప్రారంభిస్తారు. తెలంగాణకు మంజూరైన 3 నేషనల్ హైవే ప్రాజెక్టులకు కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారని సమాచారం. కేంద్ర ఎరువుల, రసాయన శాఖ కార్యదర్శి అరుణ్ సింఘాల్ ఆర్‌ఎఫ్‌సీఎల్ యూనిట్‌లో ఉన్నతాధికారులతో ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

