Home Page SliderNational

చంద్రయాన్‌-3 విజయంపై ప్రధాని మోదీ ఉద్వేగం

ప్రధాని నరేంద్రమోదీ చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ఎంతగానో కొనియాడారు. ఎల్‌వీఎం రాకెట్ ద్వారా నింగిలోకి ప్రవేశించిన చంద్రయాన్ సక్సెస్‌ఫుల్‌గా తన ప్రయాణం ముగించుకుని చంద్రుని గూర్చి పూర్తి సమాచారాన్ని అందిస్తుందని ఆశిస్తున్నట్లు కోరుకున్నారు. భారతీయ అంతరిక్ష ప్రయోగాలలో ఇది నూతన అధ్యయనం అన్నారు. ప్రతీ భారతీయుని కలలు నెరవేరే సమయం వచ్చిందన్నారు మోదీ. మన శాస్త్రవేత్తల నిరంతర కృషికి ఈ విజయం అంకితమన్నారు. వారి ఆత్మవిశ్వాసానికి, నమ్మకానికి, దేశభక్తికి తన సెల్యూట్ అని ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా భారతీయులకు, ఇస్రోకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ నేడు ఫ్రాన్స్ నేషనల్ డే ఉత్సవాలలో పాల్గొనడమే కాకుండా ఫ్రాన్స్, భారత్‌ల మధ్య అనేక ఒప్పందాలపై నేడు చర్చలు జరపనున్నారు ప్రధాని.