ఏపీ స్కాలర్‌కు ప్రధాని మోదీ ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మెడికల్ స్కాలర్ డాక్టర్ తేజస్వికి అరుదైన అవకాశం వచ్చింది. సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోదీ నుండే ఆమెకు ఆహ్వానం అందింది. ఢిల్లీలో జనవరి 26 జరగబోయే రిపబ్లిక్ పెరేడ్‌కు ముఖ్య అతిథులుగా దేశవ్యాప్తంగా 50 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రధానితో కలిసి వీక్షించే అవకాశం దక్కింది. వారిలో విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో సీనియర్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న తేజస్వి కూడా ఉన్నారు. ఈ విషయం ఆమెకు కేంద్ర విద్యామంత్రిత్వశాఖ నుండి మెయిల్ ద్వారా తెలియజేసింది.

ఆమె విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ఎయిమ్స్ జోధ్‌పూర్ జనరల్ మెడిసిన్‌లో పీజీ పూర్తి చేసింది. ఆమెకు వైఎస్ ఆర్ యూనివర్శిటీ నుండి ఆరు గోల్డ్ మెడల్స్, పీజీలో ఒక గోల్డ్ మెడల్ లభించాయి. ఆమె తండ్రి విజయవాడ వాణిజ్యపన్నుల శాఖలో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. తమ కుమార్తెకు దక్కిన ఈ అరుదైన గౌరవానికి ఎంతగానో పొంగిపోయారామె తల్లిదండ్రులు. ఆమె కూడా ఇలాంటి ఆహ్వానం అందుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని, తన తల్లిదండ్రులు, కుటుంబం ఎంతో సహకారాన్నిచ్చారని పేర్కొన్నారు.

