చిన్నారులతో ప్రధాని మోదీ సందడి..
రాఖీ పర్వదినాన్ని పునస్కరించుకుని ప్రధానమంత్రి మోదీకి దిల్లీలోని పాఠశాల విద్యార్థినులు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ప్రధాని వారితో కలిసి సందడి చేశారు. విద్యార్థినులు ప్రధాని నివాసానికి చేరి ఆయనతో ముచ్చటించారు. దేశ ప్రజలకు ప్రధాని రాఖీ సందర్భంగా తన శుభాకాంక్షలు తెలియజేశారు. సోదర సోదరీమణుల మధ్య గల అపరిమిత ప్రేమకు ప్రతీకగా ఉన్న రక్షా బంధన్ పండుగ ద్వారా బంధాలు మరింత బలంగా మారుతాయని పేర్కొన్నారు. ప్రజలంతా ఆనందంగా ఉండాలని, ఆప్యాయత, సామరస్య భావాలను బలోపేతం చేయాలని ఆకాంక్షిస్తున్నా అంటూ సందేశానిచ్చారు.