ఛత్రపతికి, ప్రధాని మోదీ క్షమాపణలు
శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ఛత్రపతికి ఆయన శిరసు వంచి క్షమాపణలు కోరారు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో వాడ్‌వణ్ పోర్ట్ శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ఛత్రపతి శివాజీ అంటే మనందరికీ దేవుడు. ఆయన విగ్రహం కూలిపోయిన ఘటనపై తలవంచి ఆయనకు క్షమాపణలు చెప్తున్నాను అని పేర్కొన్నారు. మాల్వాల్ సింధుదుర్గ్ కోటలో గత సంవత్సరం 35 అడుగుగల ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రధాని మోదీ డిసెంబర్ 4,2023న నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించారు. ఈ విగ్రహం కేవలం 9 నెలల్లోనే కూలిపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కూలడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.