Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

ఈ నెల 19న పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధుల విడుదల

రాష్ట్రంలోని రైతులకు శుభవార్తను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. పీఎం కిసాన్‌తో పాటు అన్నదాత సుఖీభవ స్కీమ్‌ను కూడా ఈ నెల 19న అమలు చేయనున్నట్లు తెలిపారు. రెండో విడత కింద రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.5వేలు, కేంద్రం వాటాగా రూ.2వేలు — మొత్తం రూ.7వేలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని వెల్లడించారు.

కడప జిల్లా కమలాపురంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ నిధులను అధికారికంగా విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

మొత్తం 46,62,904 మంది రైతులకు రూ.3,077 కోట్లు లబ్ధిగా చేరనున్నాయని అచ్చెన్నాయుడు వివరించారు. ఈ స్కీమ్ వల్ల రైతులకు పంట సీజన్‌లో ముఖ్యమైన ఆర్థిక సహాయం అందుతుందని ఆయన చెప్పారు.