పారాలింపిక్స్ అథ్లెట్లకు ప్రధాని ఫోన్..
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ రికార్డు నెలకొల్పింది. గత టోక్యో పారాలింపిక్స్‌లో సాధించిన 19 పతకాల రికార్డును దాటి 20 పతకాలు సాధించింది. ఇంకా కొన్ని ఈవెంట్లు మిగిలి ఉండడంతో మరిన్ని పతకాలు సాధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అథ్లెట్లకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. పోటీలో పాల్గొనబోయే వారికి కూడా శుభాకాంక్షలు తెలిపారు. బ్రూనైలో అధికారిక పర్యటన ముగిసిన అనంతరం పతకాలు సాధించిన దీప్తి, తంగవేలు, శరద్ కుమార్, సుందర్ సింగ్, అజీత్ సింగ్‌లను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు మోదీ. కేంద్రస్థాయిలో అథ్లెట్లకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. పారా అథ్లెట్ల కోసం రూ.22 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. 84 మందితో కూడిన అథ్లెట్ల బృందం పారిస్‌కు చేరుకోగా, వారిలో 20 మంది ఇప్పటికే పతకాలు సాధించారు. మరో ఐదు పతకాలు సాధించి, 25 పతకాలు పూర్తి చేస్తుందని ఆశిస్తున్నారు.