మా గ్రామానికి రోడ్డు వేయండి సార్..
తమ గ్రామానికి రోడ్డు వేయాలని చిన్నారులు, గ్రామస్థులు మోకాళ్లపై కూర్చుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను వేడుకున్నారు. ఏపీలోని అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట గ్రామానికి సరైన రోడ్డు లేక సకాలంలో చికిత్స అందక ఇటీవల ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. అయితే..తమ గ్రామానికి రోడ్డు వేయాలని చిన్నారులు, గ్రామస్థులు మోకాళ్లపై కూర్చుని పవన్ కళ్యాణ్‌ను వేడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్తపై పవన్ కళ్యాణ్ ఇంకా స్పందించలేదు.

