అంతరిక్షంలో అలసంద మొక్కలు..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రోదసిలో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో తొలిసారిగా అలసంద గింజల ద్వారా మొలకులు పుట్టించి, మొక్కల సాగును చేపట్టగల సత్తా ఉందని నిరూపించుకుంది. గత నెల 30న ప్రయోగించిన సీఎస్‌ఎల్‌వీ-సి 60 అనే రాకెట్‌లోని నాలుగో దశలో ఇలా ఆహారాన్ని పండించే పరిశోధనల కోసం కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బుటల్ ఫ్లాంట్ స్టడీస్ అనే వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ ద్వారా సూక్ష్మ గురుత్వాకర్షణకు మొక్కలు ఎలా సర్థుబాటు చేసుకుంటాయని అర్థం చేసుకుంటారు. సమీప భవిష్యత్తులో అంతరిక్ష యాత్రలకు వెళ్లే వ్యోమగాములు తమకు కావలసిన ఆహారాన్ని పండించుకోవలసి ఉంటుంది. ఇలాంటి ప్రయోగాల వల్ల వారికి గాలి, నీరు అందించడానికి వీలవుతుంది.

