ఇన్ఫోసిస్ కంపెనీపై ప్లేస్‌మెంట్ల రచ్చ..
ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్‌పై కార్మిక శాఖ వద్ద ఫిర్యాదు నమోదయ్యింది. రెండేళ్ల క్రితం ఆఫర్ లెటర్ ఇచ్చి , ఇప్పటి వరకూ ఉద్యోగం, ఆన్‌బోర్డ్ ఆలస్యం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. 2022 రిక్రూట్ మంట్‌లో భాగంగా రెండు వేల మందిని సెలక్ట్ చేశారు. సిస్టమ్స ఇంజినీర్, డిజిటల్ స్పెషలిస్ట్, వంటి విధులకు ఎంపిక చేశారు. వీరిని ఇంతవరకూ విధుల్లో చేర్చుకోలేదు. ఇప్పటికే పలుమార్లు ప్రాసెస్‌ను వాయిదాలు వేసింది. దీనితో ఐటీ, ఐటీఈఎస్ యూనియన్ నా సెంట్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనెట్ కేంద్రకార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది. దీనితో కంపెనీ సీఈవో సలీల్ పరేఖ్ స్పందించారు. మా కంపెనీ ఆఫర్ దక్కించుకున్నవారికి తప్పకుండా ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటించారు. నూరుశాతం హామీలిస్తున్నామని పేర్కొన్నారు. కొన్ని కారణాల వల్ల తేదీలు మారుతున్నాయన్నారు. కృత్రిమ మేధ వల్ల తమ కంపెనీలో ఎలాంటి కోతలుండవని సీఈవో తెలిపారు. దీనివల్ల వినియోగ అనుభూతి, ప్రయోజనాలు, వ్యాపారాభివృద్ధి పెరిగే కొద్దీ, మరిన్ని సంస్థలు అమలు చేస్తామని పేర్కొన్నారు. జెన్ ఏఐలో 2.5లక్షలమంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చామన్నారు.