తెలంగాణ జిల్లాలకు టాప్ 25లో చోటు
దేశవ్యాప్తంగా టాప్ 25 ధనిక జిల్లాలలో తెలంగాణ జిల్లాలకు చోటు చిక్కింది. తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా రూ. 11.46 లక్షలతో దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించింది. హైదరాబాద్ జిల్లా రూ.5.39 లక్షలతో 18వ స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో గుర్గావ్, మూడవ స్థానంలో బెంగళూరు ఉన్నాయి. తర్వాత స్థానాలలో యూపీలోని గౌతమబుద్ద నగర్, హిమాచల్ ప్రదేశ్‌లోని సోలాన్, గోవా ఉన్నాయి.