Andhra PradeshHome Page Slider

పిన్నెల్లి ప్రజాదరణ ఉన్న నాయకుడు:అంబటి రాంబాబు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు కోర్టు ఆదేశాల మేరకు ఆయనను పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా దీనిపై మాజీ మంత్రి,వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ఆయన మాట్లాడుతూ..పిన్నెల్లి ప్రజాదరణ ఉన్న నాయకుడు అన్నారు. అయితే ఆయనపై ఉద్ధేశపూర్వకంగానే కేసు పెట్టారని అంబటి ఆరోపించారు. కానీ పిన్నెల్లి స్వచ్ఛందంగానే లొంగిపోయారన్నారు.అయినప్పటికీ ఆయనపై ఫేక్ వార్తలు సృష్టిస్తూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు.