విమానం నడుపుతుండగా పైలట్ కు హార్ట్ ఎటాక్
విమానం నడుపుతున్న ఓ పైలట్ గుండెపోటు వచ్చింది. అయితే.. చాకచక్యంగా విమానం ల్యాండ్ చేసిన తర్వాత అస్వస్థతకు గురై ఫైలట్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ పైలట్ అర్మాన్ నిన్న శ్రీనగర్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానాన్ని ల్యాండ్ చేశారు. తక్షణమే స్పందించిన తోటి సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించారు. కానీ అతడు దారిలోనే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పైలట్ విమానంలో కూడా వాంతులు చేసుకున్నారని సిబ్బంది తెలిపారు.