Andhra PradeshHome Page Slider

విశాఖలో మందుబాబులకు విచిత్రమైన శిక్ష

•డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన పోలీసులు
•52 మంది మందుబాబులను కోర్టులో హాజరు
•ఒక రోజంతా ఆర్కే బీచ్ లో చెత్త ఏరివేయాలన్న న్యాయమూర్తి

విశాఖపట్నం నగరంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పెద్ద సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. పోలీసులు 52 మంది మందుబాబులను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచగా న్యాయమూర్తి వారికి ఆసక్తికరమైన శిక్ష విధించారు. విశాఖలోని ఆర్కే బీచ్ లో చెత్తను ఏరివేయడమే మీకు విధిస్తున్న శిక్ష అని పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బీచ్ లోని చెత్తను ఏరివేస్తుండాలని స్పష్టం చేశారు. దాంతో, పోలీసులు ఆ మందుబాబులను తీసుకుని బీచ్ కు వచ్చి, వారితో చెత్త ఏరివేత కార్యక్రమం షురూ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.