Home Page SliderInternationalNewsviral

ధ్వంసమైన పాక్ స్థావరాలు ఫోటోలు వైరల్..

ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించిన దాడులలో భారత్ 9 లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది. దీనికోసం 24 క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడులలో 100 మంది ఉగ్రవాదులు చనిపోగా, 60 మంది గాయపడి ఉండవచ్చని సమాచారం. ధ్వంసమైన పాక్ ఉగ్రవాదుల స్థావరాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉగ్రవాదుల కమాండ్ కేంద్రాలు, రక్షణ శిబిరాలు, ఆయుధ డిపోలు ధ్వంసమయ్యాయని రక్షణ శాఖ వివరించింది. వీటిని భూమి నుండి, గగన తలం నుండి ప్రయోగించారు. నిఘా డ్రోన్లతో రియల్ టైం పర్యవేక్షణ ద్వారా ఖచ్చితంగా లక్ష్యాలను ఛేదించినట్లు ప్రకటించింది. కేవలం ఉగ్రస్థావరాల మీదే కానీ పౌరులకు ప్రమాదం చేయకుండా ప్రయత్నించామని పేర్కొన్నారు.

మరోపక్క భారత్‌లోని పూంఛ్, తంగ్ధర్ సెక్టారలలో గత రాత్రి నుండి పాక్ కాల్పులకు పాల్పడుతోంది. దీనితో పంజాబ్, రాజస్థాన్‌లలో సరిహద్దు జిల్లాల పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అధికారిక ఉత్తర్వులివ్వకున్నా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.