Andhra PradeshHome Page Slider

అల్లు అర్జున్‌తో ఫోటో… అభిమానుల కంటతడి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వైజాగ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. పుష్ప ది రైజ్‌కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు, ప్యాన్ ఇండియా ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ షూటింగ్ గ్యాప్‌లో అభిమానులను కలవాలనుకున్నాడు. వారితో ఫోటో షూట్ ప్లాన్ చేశాడు. బన్నీతో ఫోటో షూట్ ఉందని తెలియగానే అభిమానులు భారీగా తరలివచ్చారు. బన్నీ కొందరితో ఫోటోలు దిగాడు. అయితే కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో వేదిక కోలాహలంగా మారింది. అల్లు అర్జున్ ఫోటో షూట్ సెషన్ రద్దు చేసి వెళ్లిపోయాడు. బన్నీ ఫోటో షూట్‌ను రద్దు చేసుకుని వెళ్లిపోయాడని తెలియగానే అభిమానులు నిరాశకు గురయ్యారు. కొందరు వేదికపైనే కంటతడి పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నాయి.

ఇక పుష్ప 2 సినిమా విషయానికి వస్తే.. పుష్ప సినిమా రెండో భాగాన్ని సుకుమార్ రూపొందిస్తున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇందులో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్. పార్ట్ వన్‌లో ఫహద్ విలన్ అయితే పార్ట్ 2లో అతనితో పాటు విజయ్ సేతుపతి కూడా కనిపించబోతున్నాడని సమాచారం. పుష్ప పార్ట్ వన్ రూ.300 కోట్లు వసూలు చేసి యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. దీంతో పుష్ప 2పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను నిర్మిస్తున్నారు నిర్మాతలు. శేషాచల అడవుల్లో జరుగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌తో దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముత్తంశెట్టి మీడియా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పుష్ప 2 ది రూల్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.