హరీష్‌రావుకు ఫోన్‌ట్యాపింగ్ ఉచ్చు..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదయ్యింది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. హరీష్‌తో పాటు అప్పటి ప్రభుత్వంలో ఉన్న టాస్క్‌ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావు పైనా కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని, అక్రమ కేసులు పెట్టి వేధించారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు చక్రధర్. హరీష్‌రావు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే.