చేతిలో ఫోన్.. మునివేళ్లతో ప్రచార వాణి!
సామాజిక మాధ్యమాల్లో ఊపందుకున్న వాట్సాప్ రాతలు..
హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం సాధించొచ్చు అన్న మాటలు ఈ రోజుల్లో తరచూ వింటుంటాం. చాలా సందర్భాల్లో ఇది రుజువౌతోంది కూడా.. ఎన్నికల్లో స్మార్ట్ Phone పనితీరుతో అభ్యర్థులు సత్ఫలితాలు సాధిస్తుంటారు. ఓట్లు అంటేనే ప్రచారం కదా.. ప్రజలకు అభ్యర్థి ఎంత ఎక్కువ దగ్గరైతే అంత మేలు జరుగుతుందంటున్నారు. ప్రస్తుతం జనాలు అన్నింటికన్నా ఎక్కువగా సెల్‌ఫోన్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. అందుకే సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థుల పర్యటన, ప్రచార సంగతులను ఎప్పటికప్పుడు ఫోన్‌తోనే ప్రపంచానికి తెలియజేస్తున్నారు.