ఆర్టీసీ డ్రైవర్లకు ఫోన్ బ్యాన్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డ్రైవర్ల మొబైల్ వాడకం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడడం వల్ల పెరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు టీజీఎస్ఆర్టీసీ తాజాగా 11 డిపోల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా విధుల్లో మొబైల్ ఫోన్ నిషేధం అమలు చేసింది. వరంగల్ డివిజన్ లోని పరకాల డిపో నుంచి ప్రారంభించి హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ రీజియన్లలో, డ్రైవర్లు బస్సు తీసుకునే ముందు డిపో కౌంటర్‌లో ఫోన్ డిపాజిట్ చేసి, విధులు ముగించిన తర్వాత తీసుకుని వెళ్లాలి. అత్యవసరాలకు డిపో నంబర్ లేదా కండక్టర్ మీదుగా సమాచారం చేరవేస్తారు. అయితే దీనిపై డ్రైవర్లు పెద్దగా తిరుగుబాటు చేయలేదు. పైగా ఫోన్ పై దృష్టి మళ్లించకపోవడం వల్ల ప్రశాంతంగా డ్రైవింగ్ చేస్తున్నామని మంచి స్పందన కూడా తెలియజేశారు.