Home Page SliderTelangana

నిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రీతి కన్నుమూత

నిమ్స్ లో చికిత్స పొందుతూ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూసింది. ఆమెను రక్షించేందుకు వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆమె ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ లో పీజీ విద్యార్థుల అవమాన భారంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించారు. మెరుగైన చికిత్స అందించేందుకు ప్రీతిని హైదరాబాద్ నిమ్స్ కి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ప్రీతి మృతి దురదృష్టకరమన్నారు బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్. ఆమె తల్లిదండ్రులను ఒదార్చలేకపోయానన్నారు. వారికి ధైర్యం అందించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ప్రీతి మరణానికి కారణం అయిన వారిని కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.