రాష్ట్రాల సమ్మతితో జీఎస్‌టీ పరిధిలో పెట్రోల్
పెట్రోల్, డీజిల్ జీఎస్‌టీ పరిధిలో తెచ్చే విషయంపై చాలా కాలంగా తర్జనభర్జనలు జరుగుతున్నాయి. రాష్ట్రప్రభుత్వాల అంగీకరిస్తే పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ఈ విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల స్పందనపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంది. ప్రస్తుతం రాష్ట్రాల వ్యాట్ ఆధారంగా ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. ప్రజలు ఎప్పటినుండో పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి చేర్చమంటూ కోరుతున్నారు. ఈ పరిధిలోకి వస్తే ఇంధన ధరలు గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.