తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయని వస్తున్న కథనాలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి రియాక్ట్ అయ్యారు. అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. మిడిల్ ఈస్ట్ లో అశాంతి కారణంగా చమురు సరఫరాలో ఎలాంటి కొరత లేదని, కావాల్సిన దానికంటే ఎక్కువే అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. బ్రెజిల్, గయానా వంటి దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ సరఫరా పెరిగిందని, ఫలితంగా మార్కెట్లో గణనీయ మార్పులు రావొచ్చని వెల్లడించారు. ఇటీవల ఇతర దేశాల నుంచి కూడా చమురును దిగుమతి చేసుకుంటోంది. ఫలితంగా దేశంలో చమురు నిల్వలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ఇంధన ధరలు తగ్గే చాన్స్ ఉందని కేంద్ర మంత్రి హింట్ ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ధర 73 పలుకుతోంది.


 
							 
							