Home Page SliderNational

కర్నాటకలో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే…!?

ఇంధనంపై అమ్మకపు పన్ను పెంచిన కర్నాటక సర్కారు
ఆర్థిక సంవత్సరంలో రూ.2,500-2,800 కోట్ల ఆదాయం

ఆర్థిక పరిస్థితిని సెట్ చేసుకోడానికి కర్నాటక సర్కారు పెట్రోల్, డీజిల్ ధరలపై అమ్మకం పన్ను పెంచాలని నిర్ణయించింది. దీంతో పెట్రోల్, డీజిల్‌ను మరింత పెరగనున్నాయి. లీటర్ పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ.3.5 పెరగనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంవత్సరంలో రూ.2,500-2,800 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆర్థిక శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పెట్రోల్‌పై అమ్మకపు పన్నును 3.92 శాతం, డీజిల్‌పై 4.1 శాతం పాయింట్లను పెంచింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కర్నాటకలో భారీగా లోక్ సభ సీట్లను గెలుచుకోవాలని భావించిన కాంగ్రెస్ పార్టీకి 28 స్థానాలకు గాను 9 స్థానాలే దక్కాయి. దీంతో అధికార కాంగ్రెస్‌కు నిరాశే మిగిలింది.

కర్నాటక సీఎం సిద్ధరామయ్య, ఆర్థికశాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర ఆదాయ ఉత్పత్తి, ఆర్థిక స్థితిని సమీక్షించిన కొద్ది రోజుల తర్వాత ఆయన పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సంవత్సరం, సిద్ధరామయ్య కాంగ్రెస్ ప్రధాన ‘హామీ’ పథకాల కోసం 52,009 కోట్ల రూపాయలను కేటాయించారు. గతేడాది తన ప్రభుత్వం ఈ పథకాలకు రూ.37,325 కోట్లు ఖర్చు చేశారు. ‘హామీ’ పథకాల వల్ల తీవ్రమవుతున్న ఆర్థిక అవసరాలను తీర్చేందుకు వనరుల సమీకరణపై ప్రభుత్వంలో ఆందోళనలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 14, జూన్ 4 మధ్య, లోక్‌సభ ఎన్నికల నమూనా ప్రవర్తనా నియమావళి కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు మూడు నెలలు నష్టపోయింది. అంతే కాకుండా, ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆదాయ వసూళ్లు మందగించింది. ఈ వారం ప్రారంభంలో, ఆర్థిక సమీక్ష సందర్భంగా, ఆదాయ సేకరణ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కష్టపడి పనిచేయాలని సిద్ధరామయ్య అధికారులను కోరారు.