అమరన్ మూవీ ధియేటర్ పై పెట్రో బాంబు దాడి
తమిళనాడులోని తిరునల్వేలి ప్రాంతంలో అమరన్ మూవీ ప్రదర్శిస్తున్న అలంకార్ ధియేటర్ పై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు.ఏకంగా పెట్రో బాంబులు విసిరారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు నిందితులను సీసీ టివి ఫుటేజి ఆధారంగా గుర్తించగా,మూడో నిందితుని గురించి ఆరా తీస్తున్నారు.అమరన్ మూవీలో తమ వర్గానికి వ్యతిరేకంగా పలు సన్నివేశాలున్నాయని ,వాటిని తొలగించాలని కోరినా నిర్మాతలు వినిపించుకోలేదన్న కోపంతో వారు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. కాగా సినిమా ప్రదర్శించబడుతున్న అలంకార్ థియేటర్ వద్ద పోలీసులు భద్రత పెంపొందించారు.