యజమానిపై పెంపుడు కుక్క దాడి.. తీవ్ర రక్తస్రావంతో మృతి!
పెంపుడు కుక్క యజమానిపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ – మధురానగర్‌లో జరిగింది. మధురానగర్ లోని ఓ అపార్ట్‌మెంట్‌లో తన పెంపుడు కుక్కతో కలిసి పడుకున్న పవన్ కుమార్(37) ఉదయం అతని స్నేహితుడు వచ్చి తలుపు తట్టగా, పవన్ కుమార్ డోర్ ఓపెన్ చేయలేదు. దీంతో చుట్టుపక్కల వారితో కలిసి డోర్ పగలగొట్టి చూడగా, రక్తపు మడుగులో పవన్ కుమార్ చనిపోయి కనిపించాడు. పవన్ కుమార్ మర్మాంగాలను కొరుక్కుతిని, నోటి నిండా రక్తంతో పెంపుడు కుక్క కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.