యురేనియం నిక్షేపాల వెలికితీతకు అనుమతులు.. రాళ్లు రువ్వుతున్న కప్పట్రాళ్ల గ్రామస్తులు
కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో రాజకీయ రగడ మొదలైంది. కేంద్రం అనుమతించిన యురేనియం నిక్షేపాల వెలికితీతకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.అయితే దీనికి సంబంధించిన అనుమతులను మీరిచ్చారంటే..మీరిచ్చారంటూ వైసీపి ,టిడిపిలు వాదప్రతివాదనలు చేసుకుంటున్నాయి.మరో వైపు కప్పట్రాళ్ల గ్రామస్థులు యురేనియం నిక్షేపాల వెలికితీత పనులు నిలిపివేయాలంటూ నిరశనలు వ్యక్తం చేస్తున్నారు. అణుబాంబుల తయారీతో పాటు విద్యుత్ ఉత్పత్తికి సైతం యురేనియం ముడి ఖనిజం ఎంతగానో ఉపయోగ పడుతుంది.పైగా ప్రపంచంలో ఉన్న యురేనియం నిక్షేపాలతో పోల్చుకుంటే భారత్‌లో అందునా కర్నూలు జిల్లా లో ఉన్న నిక్షేపాల శాతం ఎక్కువ.ఆ కారణం చేతనే కేంద్రం అనుమతులు జారీ చేసింది.