బీజేపీ పార్టీకే ప్రజల మద్దతు-అభ్యర్థి రావు పద్మ
సుబేదారి: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల మద్దతు బీజేపీకి ఉందని అభ్యర్థి రావు పద్మ తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం శ్రీదేవి ఏషియన్ మాల్, కృష్ణజంక్షన్, డీజిల్ కాలనీ, అలంకార్ జంక్షన్‌లలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లలో సమావేశాలు జరిగాయి. రావు పద్మ మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని కోరారు. స్థానికంగా ఉండి సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇవ్వడం, తర్వాత మర్చిపోవడం జరుగుతోందన్నారు. ఒక్కసారి బీజేపీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.