Andhra PradeshNews

ఏసీలో పొగలు, సెగలతో పరుగులు తీసిన జనం

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. కేరళ హోటల్ పక్కన ఓ ఇంట్లో ఏసీ నుండి పొగలు, సెగలు రావడంతో వారు భయపడి బయటకు పరుగులు తీశారు. ఏసీ కాలిపోవడమే కాకుండా ఇంట్లో సామాగ్రి కూడా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు వచ్చి మంటలను అదుపుచేశారు. దీనితో ప్రమాదం తప్పింది. విపరీతమైన ఎండలకు తాళలేక చాలామంది తక్కువ టెంపరేచర్స్‌తో ఏసీని వాడుతూంటారు. అయితే ఇది చాలా ప్రమాదకరమైంది. బయటి వాతావరణానికి, ఏసీలో మనం సెట్ చేసిన వాతావరణానికి చాలా తేడా ఉండడంతో ఏసీ కంప్రెసర్‌పై అధికభారం పడి దానినుండి మంటలు, పొగలు వెలువడే ప్రమాదం ఉంది. దీనితో ఇంటికే ముప్పు రావచ్చు. నాసిరకం ఏసీలు కూడా ఇలాంటి ప్రమాదాలను కలుగజేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.