News

మాయమవుతున్న మనుషులు… వీళ్లకంటే పశువుల నయం…

అడక్కుతినండి.. ఇదిగో చిప్ప అంటూ తమ కన్న బిడ్డలే కాల యముడి అవతారమెత్తడంతో కనీ పెంచిన తల్లిదండ్రులు చావే శరణ్యమనుకున్నారు. వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. రాజస్థాన్ నాగౌర్ కు చెందిన హజారీరామ్ బిష్ణోయ్, 70, 68 ఏళ్ల భార్య చావలీ దేవి, కన్న బిడ్డలు పెట్టే టార్చర్ తట్టుకోలేక తనువు చాలించారు. ఇంటి గోడపై రెండు పేజీల సూసైడ్ నోట్‌లో, ఇద్దరు కుమారులు ఏ విధంగా కొట్టి హింసించారో రాశారు. ఆస్తిని కాజేసి, తమను తమ కొడుకులు, కుమార్తెలు పస్తులుంచారని వాపోయారు వారు. కొడుకులు, కోడళ్లు చావబాదినప్పటికీ ఓర్చుకున్నారు. ఆత్మగౌరవం దెబ్బతినేలా అడక్కుతినాలని చెప్పేసరికి ఆ తల్లిదండ్రులు ఆత్మహత్య శరణ్యమనుకున్నారు. తమపై ఎవరికీ కంప్లైట్ చేయొద్దని లేదంటే నిద్రలోనే చంపేస్తామని హెచ్చరించారని లేఖలో చెప్పారు.