Home Page SliderNational

కన్నడ ప్రజలు నీచ రాజకీయాలను తిప్పికొట్టారు: KTR

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంచనాలను దాటి అఖండ విజయాన్ని  సొంతం చేసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి.ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలపై తెలంగాణా మంత్రి కేటీఆర్ స్పందించారు. కర్ణాటకలో ఘనవిజయాన్ని కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌కు కేటీఆర్ శుభకాంక్షలు తెలియజేశారు. కేరళ స్టోరీని కర్ణాటక ప్రజలు ఎలా    తిప్పికొట్టారో ఎన్నికల్లోనూ అలాంటి ఫలితాన్నే ఇచ్చారన్నారు. రాష్ట్ర్లంలో నీచమైన,విభజన రాజకీయాలను తిరస్కరించిన కన్నడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో కన్నడ ఫలితాలు తెలంగాణాపై ఎలాంటి ప్రభావం చూపవన్నారు. ఇకపై హైదరాబాద్,బెంగుళూరు పెట్టుబడులను ఆకర్షించడంలో పోటి పడాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.