USAలో భారీ మోసానికి పాల్పడ్డ భారత సంతతి వ్యక్తులు
అమెరికాలో భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు భారీ మోసానికి పాల్పడ్డారు. కాగా భారత సంతతికి చెందిన రిషి,షాహ్-శ్రద్దా అగర్వాల్ అమెరికాలో ఔట్‌కమ్ హెల్త్ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించారు. అయితే వీరు ఈ స్టార్టప్‌తో అడ్వర్టైజ్ చేయకుండానే చేశామంటూ ఇన్‌వాయిస్‌లు పంపి క్లయింట్ల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా వారు క్లయింట్ల నుంచి $1 బిలియన్ (రూ.8వేల కోట్లు) వసూలు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే ఈ కేసులో ఈ సంస్థ వ్యవస్థాపకులు రిషి, షాహ్-శ్రద్దా అగర్వాల్,మాజీ COO బ్రాడ్ పుర్డీ దోషులుగా ఉన్నట్లు రుజువయ్యింది. ఈ నేపథ్యంలో నిందితుల ముగ్గురికి గరిష్ఠంగా 30 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అమెరికా మీడియా వర్గాలు వెల్లడించాయి.

