Andhra PradeshHome Page Slider

చంద్రబాబు ప్రచార పిచ్చికి జనాలు బలి

◆ మరణాలన్నిటికి చంద్రబాబు బాధ్యత వహించాలి-మంత్రి రజిని
◆ అరకేజీ నూనె.., అరకేజీ కందిపప్పు, చీర ఇస్తామంటూ మభ్యపెట్టారు
◆ గుంటూరులో బాధితులను పరామర్శించిన మంత్రి రజిని

గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కానుకల పంపణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిన సంఘటనపై ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రచార యావకి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రచార యావకి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవటం చాలా బాధాకరమని… ఏదో చేసేస్తున్నట్లు, ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారని విమర్శించారు. గత పది రోజులుగా ఇక్కడేదో పంచుతున్నారని ఒక ఫేక్‌ ప్రచారాలు చేశారని , మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి వాహనాలు పెట్టి జనాలను మభ్యపెట్టి ఇక్కడి తీసుకొచ్చారన్నారు.

గోరంత ఇచ్చి కొండంత అని చెప్పుకునే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. కేజీ కందిపప్పు, అరకేజీ నూనె ఇచ్చి ఏదో అన్ని సరుకులు ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్నారని మొన్న కందుకూరులో 8 మంది మరణించారని ఇప్పుడు గుంటూరులో ముగ్గురు మరణించారని ఈ చావులన్నింటికీ కూడా చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలన్నారు. ముఖ్యమంత్రి వైస్ జగన్ కూడా ఈ సంఘటన పై దిగ్బ్రాంతి వ్యక్తం చేసారని మంత్రి రజని తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం అందించాలని, గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు.