Andhra PradeshHome Page Slider

అక్కడ సంతలో మద్యం అమ్మబడును

వారాంతపు సంతలో కూరగాయాలు అమ్ముతారని తెలుసు.. కానీ సంతలో మద్యం అమ్మకాలను చూసి జనాలు ఆశ్యర్యపోతున్నారు. ఈ ఘటన ఎక్కడిదో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చోటు చేసుకుంది. ఆదివారం సంత లో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ సంతలో.. రోడ్డు పక్కన.. ఇళ్ల బయట మద్యం బాటిళ్లు ప్రత్యక్షమయ్యాయి. బల్లలు వేసి.. లిక్కర్ బాటిళ్లు డిస్ ప్లే చేస్తూ.. యధేచ్ఛగా అమ్మేస్తున్నారు. ఈ ఘటన చూసి సంతకు వచ్చిన మహిళలు అవాక్కయ్యారు. ఇలా కూడా మద్యం అమ్ముతారా అంటూ చర్చించుకున్నారు. ఈ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.