Andhra PradeshHome Page Slider

చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు:మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మాచర్ల ఎమ్మెల్యే పల్నాడు జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ పిన్నెల్లి రామకృష్ణరెడ్డి అన్నారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు చిలుకూరి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ సంబరాలలో ఆయన పాల్గొన్నారు. ఇటీవల మహానాడు వేదికగా మళ్ళీ ప్రజలను మోసం చేయటానికి చంద్రబాబు జిమ్ముక్కులు చేస్తున్నారని గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలో ఒకటి కూడా అమలు చేయని చంద్రబాబు మరలా ప్రజలను మోసం చేసేందుకు ఎత్తుగడ వేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

యువగళం పేరుతో ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగ భృతి అని చెప్తున్నా చంద్రబాబు 2014 లో ఇదే హామీ ఇచ్చి నిరుద్యోగుల చేత ఓట్లు వేయించుకొని వాళ్ళని మోసం చేయలేదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. బాబు రావాలి జాబు రావాలి అని ప్రచారం చేసి యువతను మోసం చేసింది తెలుగుదేశం పార్టీ కదా అని మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికి మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయాలి అనుకుంటే చంద్రబాబు మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అయన వెల్లడించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికీ నాలుగేళ్లు అయిందని కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా నవరత్నా పథకాలను ప్రజలకు అందించిన ఏకైక మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. ఆనాడు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేస్తూ రాష్ట్రంలో ఇప్పటికే పేదవర్గాలకు రెండు లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ప్రతిఇంటికి అందించటం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.