Andhra PradeshNews

ఇకపై పింఛన్ మొత్తం రూ. 2,750

ఏపీలో పింఛన్ల మొత్తాన్ని ఇప్పుడిస్తున్న 2,500 రూపాయల నుంచి 2,750 రూపాయలకు పెంచనున్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. వచ్చే జనవరి నుంచి పెంచిన పింఛన్ మొత్తాన్ని అందిస్తామన్నారు. మెల్ల మెల్లగా పింఛన్ల మొత్తాన్ని మూడు వేల రూపాయలకు తీసుకెళ్తామని జగన్ భరోసా ఇచ్చారు. కుప్పం నియోజకవర్గంలో చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ పింఛన్లకు సంబంధించి హామీ ఇచ్చారు. కుప్పం అంటే ఇప్పుడు చంద్రబాబు పాలన కాదని… అక్కాచెల్లెమ్మల పాలన అంటూ చెప్పుకొచ్చారు. ఏపీలో ఇప్పటి వరకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ ద్వారా లక్షా 71 వేల కోట్ల 244 కోట్లు పంపిణీ చేశామన్నారు.