యూనియన్ బ్యాంక్‌కు జరిమానా
టిజి: హైదరాబాద్ టోలిచౌకిలోని యూనియన్ బ్యాంకుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. ఖాతాదారు పోగొట్టుకున్న రూ.15,000, 9 శాతం వడ్డీతో చెల్లించడంతో పాటు రూ.5 వేలు పరిహారం, రూ.2 వేలు కేసు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. తన ఖాతాలోంచి రూ.15 వేలు విత్‌డ్రా అయినట్టు బాధితుడు శ్రీనివాసులు ఫిర్యాదు చేశాడు. నగదు లావాదేవీలపై ఖాతాదారులను అప్రమత్తం చేయడంలో బ్యాంక్ విఫలమైందని పేర్కొన్న కమిషన్ తీర్పు వెలువరించింది.