పెద్దపల్లి: సంధ్యారాణికి ఓటు వేస్తే నాకు వేసినట్టే-ఈటల
పెద్దపల్లి జిల్లా: సంధ్యారాణికి ఓటు వేస్తే నాకు కూడా ఓటు వేసినట్టే అన్న ఈటల రాజేందర్ గారు.
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మూడవ స్థానంలో ఉంది. హుజూరాబాద్ గడ్డమీద ఎలాంటి తీర్పు వచ్చిందో తెలంగాణలో కూడా అదే తీర్పు రాబోతోంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే మళ్ళీ BRSకే పోతారు. మీరు వద్దు అనుకుంటున్న కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. రాజ్యాధికారం అందిపుచ్చుకునే చారిత్రాత్మక సన్నివేశంలో తెలంగాణ బీసీలున్నారు దాన్ని జారవిడుచుకోవద్దని కోరుతున్నాను. నేను బిఆర్ఎస్‌లో ఉంటే ఉన్న బానిసలలో నేను కూడా ఒక బానిసగా ఉండేవాడిని. కానీ బయటికి వచ్చి నాలుగు కోట్ల ప్రజలకు నాయకత్వం వహించే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను–ఈటల రాజేందర్.
రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కందుల సంధ్యారాణి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్. పోలీస్ స్టేషన్లను తెరాస కార్యాలయంగా మార్చిన సంస్కృతికి డిసెంబర్ 3వ తేదీతో అంతం పలకబోతున్నాం. ఓటర్లలో సగభాగం మహిళలే, మన ఆడబిడ్డ సంధ్యను గెలిపించుకుందాం. డబ్బులు లేవు కానీ కాలుకు ముళ్లుగుచ్చుకుంటే పంటితో పీకేంత సేవ చేసే గుణం ఉంది. ఇన్నిసార్లు మీరు గెలిపించినా మచ్చ తెలీదు. అందుకే మీరు మళ్లీ మళ్లీ గెలిపించారు. 30 ఏళ్లుగా వివిధ హోదాల్లో ప్రజాప్రతినిధిగా పనిచేసింది. డబ్బులు సంపాదించి దాదాగిరి చేసే వారికి ఆడబిడ్డకు మధ్య పోటీ.
సంధ్యారాణికి ఓటు వేస్తే నాకు కూడా ఓటు వేసినట్టు. రాహుల్ గాంధీ 2% ఓట్లు అని మాట్లాడుతున్నాడు మా ఓట్లు 52% బిడ్డ. మాఓట్లు మేము వేసుకుంటే మీకు డిపాజిట్లు కూడా దక్కవు. బీసీ, ఎస్సీ, ఎస్టిని మైనారిటీని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర మీకు ఉందా? టిఆర్ఎస్ ఉన్నంతకాలం కెసిఆర్, కేటీఆర్ లేదా ఆయన కొడుకు సీఎం అవుతారు తప్ప మరొకరికి అవకాశం ఇవ్వరు. బడుగు బలహీనవర్గాలకు అండగా ఉండే ప్రభుత్వం మాది అని నరేంద్ర మోడీ గారు తేల్చి చెప్పారు. మాట ఇస్తే తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ. 2013లో ఎల్బీనగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి మీ ఆశీర్వాదం కావాలి అంటే నన్ను ప్రధానమంత్రిని చేశారు. ఇదే గడ్డమీద నుంచి అడుగుతున్నాను.. భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి బీసీని సీఎం చేస్తా అని ప్రకటించారు. సంధ్యారాణికి ఓటు వేస్తే నాకు ఓటు వేసినట్టే. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మూడవ స్థానంలో ఉంది. హుజూరాబాద్ గడ్డమీద ఎలాంటి తీర్పు వచ్చిందో తెలంగాణలో కూడా అదే తీర్పు రాబోతోంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే మళ్ళీ BRS కే పోతారు. మీరు వద్దు అనుకుంటున్న కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. 2014లో శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీని రద్దు చేసుకుంటున్నామని చెప్పి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 లో 19 మంది శాసనసభ్యులను ప్రజలు గెలిపించి.. మా తరఫున కొట్లాడండి. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయండి అని పంపిస్తే.. 12 మంది శాసనసభ్యులు మా పార్టీ రద్దు చేసుకుంటున్నామని టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవులు వెలగబెడుతున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వారిని గెలిపిస్తే మీరు వద్దనుకుని కేసీఆర్ గద్దెనెక్కే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన మళ్ళీ వచ్చేది కేసీఆర్ తప్ప వేరేవారు కాదు. కానీ భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తే.. 52 శాతంగా ఉన్న బీసీ బిడ్డలు ముఖ్యమంత్రి అవుతారు. రాజ్యాధికారం అందిపుచ్చుకునే చారిత్రాత్మక సన్నివేశంలో తెలంగాణ బీసీలున్నారు దాన్ని జార విడుచుకోవద్దని కోరుతున్నాను.
మొదటి ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు నన్ను అవమానించడం సభలో కాలర్ ఎగరేసి తల ఎత్తుకొని లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడుతున్నాను.. ఇది రాజుల సొమ్ము కాదు ఇది నా తెలంగాణ ప్రజల రక్త మాంసాలు చెమట బిందువుల కష్టం మీద కట్టిన పన్నుల డబ్బు.. పేదల కష్టాలకు పరిష్కారం చూపే బాధ్యత ఉంది అని చెప్పిన బిడ్డ రాజేందర్ అని మర్చిపోవద్దు. రాజేందర్ కులపరంగా, మతపరంగా ఎదగలేదు. ఒక ఉద్యమ బిడ్డగా ఎదిగినా. కరోనా సమయంలో ప్రతిఒక్కరూ భయపడ్డారు. అమెరికా, బ్రిటన్ ప్రెసిడెంట్ కూడా కన్నీరు పెట్టుకున్నారు. నా ప్రజలను కాపాడండి దేవుణ్ణి కోరుకున్నారు. ఆ సమయంలో అన్ని ఆసుపత్రులు తిరిగి ధైర్యం మందుని ఇచ్చాను.
నేను బిఆర్ఎస్‌లో ఉంటే ఉన్న బానిసలలో నేను కూడా ఒక బానిసనై ఉండేవాడని. కానీ బయటికి వచ్చి నాలుగు కోట్ల ప్రజలకు నాయకత్వం వహించే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. బిజెపి వస్తే డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తాను. సింగరేణి కార్మికులకు ఇన్‌కమ్ టాక్స్ ఎక్సెంప్షన్ అందిస్తాం. 63 వేల నుండి 39 వేల మందికి కార్మికుల సంఖ్య పడిపోయింది.
సింగరేణి ప్రైవేట్‌కి కట్టబెట్టారు. బీజేపీ వస్తే కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అందిస్తాం. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకి కోల్ ఇండియా 1200 రూపాయలు ఇస్తుంటే.. ఇక్కడ 600 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. కోల్ ఇండియాలో పనిచేస్తున్న కార్మికులతో సమానంగా మీకు కూడా వేతనాలు పెంచి ఇస్తాము. రైతులకు రూ.3,100 మద్దతు ధర అందిస్తాం.