“పెద్దన్న నాకు చాలా గర్వంగా ఉంది”: రాజమౌళి
టాలీవుడ్ సంగీత దిగ్గజం ఎం.ఎం.కీరవాణికి భారతప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. దీనిపై టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరు కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ “మా పెద్దన్నకు పద్మశ్రీ రావడం గర్వంగా ఉంది” అంటూ ట్వీట్ చేశారు. కాగా నిన్న రాష్ట్రపతిభవన్‌లో పద్మ అవార్డుల ప్రధానం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి కళారంగంలో పద్మశ్రీ అవార్డు వరించింది. అంతేకాకుండా ఎం.ఎం.కీరవాణి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో RRR సినిమాలో “నాటు నాటు” పాటకుగాను ఆస్కార్‌ను సైతం కైవసం చేసుకున్నారు.

