Home Page Sliderhome page sliderNational

ఇరుదేశాల సరిహద్దుపై ప్రశాంత వాతావరణం

భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత పరిస్థితులు మధ్య మొదటిసారి నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంత వాతావరణం నెలకొంది. ‘నిన్న రాత్రి అంతర్జాతీయ సరిహద్దు వెంట జమ్మూ కశ్మీర్ సహా ఇతర ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఎలాంటి కాల్పులు జరగలేదు. ఇటీవలి కాలంలో మొదటి సారి ప్రజలు రాత్రిపూట ప్రశాంతంగా గడిపారు అని ఇవాళ భారత సైన్యం ప్రకటించింది. పాకిస్తాన్ జరిపిన కాల్పులు, డ్రోన్ ల దాడితో ఇంతకాలం సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన ప్రజలు తిరిగి సొంత ఇళ్లకు వచ్చే ఆలోచన చేస్తున్నారు.