Home Page SliderPoliticsTelanganatelangana,

‘అదానీనే కాదు కేసీఆర్ డబ్బిచ్చినా తీసుకుంటాం’..పీసీసీ చీఫ్

పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ అదానీ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన రూ.100 కోట్లపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. అది కూడా లంచం సొమ్మేనని ఆరోపించారు కేటీఆర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి సొమ్మును ఎలా స్వీకరించారని, ఢిల్లీలో రాహుల్ గాంధీ అదానీపై ఆరోపణలు చేస్తుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అదానీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. దీనికి కౌంటర్ ఇచ్చారు మహేశ్ గౌడ్. అదానీ ఇచ్చిన సొమ్ము సీఎం రేవంత్ రెడ్డి జేబులోకి పోలేదని, అది స్కిల్ యూనివర్సిటీ కోసం ఉపయోగిస్తామని, దాని కోసం కేసీఆర్ కూడా రూ.50 కోట్లు ఇస్తే తీసుకుంటామన్నారు. అదానీకి ఇంకా తెలంగాణ ప్రభుత్వం సెంటు భూమి కూడా ఇవ్వలేదని, అదానీతో చేసుకున్న ఒప్పందాలు పరిశీలించి, తప్పయితే రద్దు చేసుకుంటామని వ్యాఖ్యానించారు.