Home Page SliderTelangana

పీసీ ఘోష్ కమిషన్ విచారణ గడువు పొడిగింపు

టిజి: జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కాళేశ్వరం న్యాయ కమిషన్ గడువును ప్రభుత్వం మరో 2 నెలలు పొడిగించింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై విచారణ గడువు రేపటితో ముగియనుండగా, ఆగస్టు 31 వరకు అవకాశమిచ్చింది. కాగా ఘోష్ ఆదేశాల మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన, ఇఎన్‌సీలు, సీఈలు, ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు దాదాపు 60 మంది సీల్డ్ కవర్లలో అఫిడవిట్లు దాఖలు చేశారు.