Home Page SliderTelangana

QR కోడ్‌తోనూ కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు!

TG: ఇకపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) పరిధిలో కరెంట్ బిల్లులను QR కోడ్‌తో చెల్లించవచ్చు. ఆ సంస్థ వచ్చే నెల నుండి బిల్లులపై  QR కోడ్ ముద్రించనుంది. చెల్లింపు కోసం వినియోగదారులు ఆ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే NPDCL దీన్ని పైలెట్ ప్రాజెక్టుగా కొన్నిచోట్ల అమలు చేస్తోంది. సంస్థ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా బిల్లులు చెల్లించడం కంటే ఈ QR కోడ్ ద్వారా చెల్లింపు సులభతరం కానుంది.