పవన్ విచిత్ర వ్యాఖ్యలు
ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార విపక్షాల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. కూటమిలోని మూడు పార్టీలు కాకుండా సభలో ఉన్నది తమ పార్టీయే కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైసీపీ పార్టీ డిమాండ్ చేసింది. గవర్నర్ ప్రసంగం ముగిసాక వాకౌట్ చేస్తూ వైసీపీ పార్టీ వెళ్లిపోయింది. అయితే మీడియా పాయింట్ వద్ద జనసేన నేత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో టీడీపీ తర్వాత జనసేనే పెద్ద పార్టీ అని, జనసేన ఉండగా వైసీపీకి ఎలా ప్రతిపక్ష హోదా ఇస్తారంటూ మాట్లాడారు. జనసేన కంటే ఒక్క సీటి ఎక్కువ ఉన్నా వాళ్లకు ప్రతిపక్ష హోదా దక్కేదని, ఓట్లశాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెళ్లాలని సూచించారు. ఈ ఐదేళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు. అది ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో కూడా లేదు అంటూ వ్యాఖ్యానించారు.

