‘బ్రో’ సినిమా చూడడానికి వచ్చిన పవన్ తనయుడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూదేశాల తనయుడు అకీరా నందన్ ‘బ్రో’ సినిమా థియేటర్ వద్ద సందడి చేశాడు. ‘వినోదాయసిత్తం’ అనే తమిళ సినిమాకు రీమేక్‌గా దర్శకుడు సముద్ర ఖని రూపొందించిన ఈ చిత్రం తెలుగులో ‘బ్రో’ గా మన ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్ల వద్ద పవర్ స్టార్ భారీ కటౌట్లతో అభిమానులంతా సందడి చేస్తున్నారు. పవన్ తనయుడు అకీరా నందన్ కూడా బ్రో చిత్రాన్ని చూడాలనే ఆకాంక్షతో ఈ చిత్రాన్ని వీక్షించడానికి హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌కు వచ్చారు. పవన్ అభిమానులతో కలిసి ఈ చిత్రాన్ని చూశారు. అకీరాను గమనించిన పవన్ అభిమానులు చాలా హడావుడి చేశారు. అకీరాకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. జూనియర్ పవర్ స్టార్ అంటూ అభిమానులు సందడి చేస్తున్నారు.

ఈ రోజు రిలీజైన ఈ చిత్రం పవన్ ఇమేజ్‌కు తగినట్లు చేసిన మార్పులతో అభిమానులను బాగానే అలరించింది. గత పవన్ సినిమాలోని పాటలతో కొన్ని పాటలను రీక్రియేట్ చేశారు. పవన్, సాయి ధరమ్ తేజ్‌ల పవర్‌ఫుల్ యాక్షన్‌తో, కామెడీతో ఈ చిత్రం మంచి టాక్‌నే సంపాదించింది.

