Andhra PradeshHome Page Slider

గ్రామసభలో వైసీపీపై పవన్ కీలక వ్యాఖ్యలు

అన్నమయ్య జిల్లాలో మైసూరవారి పల్లిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తూ “గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుకొమ్మలన్నారు. వైసీపీ పార్టీ గురించి మాట్లాడుతూ గ్రామసభల్లో పంచాయితీలో 75 శాతం వరకూ వైసీపీకి చెందిన సర్పంచ్‌లే ఉన్నారన్నారు. వారందరూ కూడా ఊర్ల అభివృద్ధిలో తద్వారా రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకోవాలని సూచించారు. దురదృష్టవశాత్తూ గత ప్రభుత్వం 41 వేల కోట్ల రూపాయలు ఖర్చు రోడ్లపై ఖర్చు పెట్టానని చెప్పి, కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే పనులు కనిపిస్తున్నాయి. ఒక సర్పంచ్ అన్నాహజారే తలచుకుంటే దేశాన్నే కదిలించారు. మనందరం ఐక్యతగా ఉంటే ఎన్ని కోట్లు అప్పులున్నా తీర్చగలం. ఇక్కడ రైల్వే కోడూరు ఉద్యానపంటలకు పెట్టింది పేరు. ఇక్కడ నేలలో పండే పండ్లు అంత బాగుంటాయి. రాయలసీమ విశిష్టత ఎంతమందికి తెలుసు. పూర్వం చదువుల తల్లిగా పేరుగాంచింది. ఇలాంటి నేలపై ఇప్పుడు గొడవలెందుకు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర ప్రభుత్వం వరకూ ప్రతీ ఒక్కరూ పని చేయాలి. చంద్రబాబు అనుభవంతో రాష్ట్రంలో ఎన్ని అప్పులున్నా ఒకటో తారీఖునే పెన్షన్లు, జీతాలు ఇవ్వగలిగారు. రాయలసీమ వాసులందరి కోసం కూలీగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ఈ పదవి అలంకారం కాదు బాధ్యతగా పని చేస్తాను.” అని హామీ ఇచ్చారు.