కేసీఆర్ గాయంపై పవన్ కీలక వ్యాఖ్యలు
బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గాయమయ్యిందని తెలిసి చాలా బాధపడ్డానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తొందరలో కోలుకోవాలని ఆశిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ప్రకటన విడుదల చేశారు. రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లు, వత్తిడులు ఎదుర్కొని గెలిచిన, కేసీఆర్ అనారోగ్య సమస్యల నుండి కూడా త్వరలోనే కోలుకోవాలని, ప్రజలకు, సమాజానికి తన సేవలను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. కాగా నేడు కేసీఆర్‌కు తుంటి ఎముక ఫాక్చర్ అయ్యిందని సర్జరీ చేయాల్సి ఉంటుందని యశోదా ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. దీనిపై ప్రభుత్వ పరంగా కూడా ఏ లోటు పాట్లు లేకుండా సక్రమంగా జరిగేలా చూడాలంటూ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే.