ఇద్దరు కుమార్తెలతో తిరుమలకు పవన్..చిన్నకుమార్తె డిక్లరేషన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలకు కాలినడకన వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన తన కుమార్తెలతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. ఆయన చిన్నకుమార్తె పొలెనా అంజనా కొణిదెల క్రిస్టియన్ కావడంతో ఆమె డిక్లరేషన్ ఇచ్చారు. ఆమె మైనర్ బాలిక కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ సంతకాలు చేశారు. చాలాకాలం తర్వాత పవన్, అన్నా లెజ్లినోవాల కుమార్తె పొలెనాను చూడడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేడు ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు.

