Andhra PradeshNews

చెప్పుతో కొడతా… కొడకల్లారా.. వైసీపీ నేతలకు ఓ రేంజ్‌లో పవన్ వార్నింగ్

వైసీపీ-జనసేన మధ్య యుద్ధం ఇప్పుడు పతకా స్థాయికి చేరుకొంది. ఇప్పటి వరకు వైసీపీ నేతలను, సీఎం జనగ్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్న తీరుకు పూర్తి భిన్నంగా రియాక్ట్ అయ్యారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. ప్యాకేజీ స్టార్, ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శిస్తే ఇక ఊరుకోనన్నారు. చెప్పు తీసుకొని కొడతా… ఒక్కొక్క వైసీపీ కొడకల్లారా అంటూ దుయ్యబట్టారు. ఇంకోసారి ప్యాకేజీ స్టార్ అంటే… చెప్పు చూపించి మరీ కొడతానంటూ పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం నా సహనం మిమ్మల్ని కాపాడిందన్నారు పవన్ కల్యాణ్… ఎదవల్లారా.. సన్నాసుల్లారా.. చవటల్లారా.. దద్దమ్మల్లారా.. నా సహనం ఇన్నాళ్లూ మిమ్మల్ని రక్షిస్తుందంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ గూండాగాళ్లారా… మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా.. మీ దగ్గర రౌడీలున్నారా.. ఒంటి చెత్తే మెడ పిసికేస్తా… ప్యాకేజీ అంటూ ఎవరైనా కామెంట్లు చేస్తే దవడ వాసిపోయేలా కొడతనంటూ దుయ్యబట్టారు.

మా ఆడబిడ్డ వినూత మీద చెయ్యేస్తార్రా కొడకల్లారా.. భాష రాదనుకున్నారా.. నేను లండన్, న్యూయార్క్‌లో పెరగాననుకుంటున్నారా ఎదవల్లారా… పుట్టింది పెరిగింది పక్కన ఉన్న బాపట్లలో.. ఏదో సన్నగా ఉంటాం.. నీరసంగా ఉంటాం.. సినిమాల్లో యాక్ట్ చేస్తామనుకుంటే ఎలా… సున్నితంగా ఉంటామనుకుంటే ఎలారా ఎదవల్లారా… . బాపట్లలో పుట్టా గొడ్డుకారం తిన్నవాడినిరా… చీరాల చిన్నరథం.. పెద్ద రథం దగ్గర పెరిగినోడినిరా… ఒంగోలు గోపాల్ నగర్ వీధిబడిలో చదుకున్నానురా.. మీరు పబ్లిక్ స్కూళ్లలో చదుకున్నార్రా.. చిన్న చిన్న స్కూళ్లు, వీధుబడిల్లో చదువుకున్నా నేను.. కొడకల్లారా నా భాష తెలుసురా.. అంటూ నిప్పులు చెరిగారు. మర్యాద ఇస్తాం.. మీరు మర్యాద నిలబెట్టుకునేవరకే మాత్రమేనన్నారు. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నానంటున్నారు.. మీరు చేసుకోండి.. ఎవరు కాదన్నారు… పెళ్లి చేసుకున్న మొదటి భార్యతో వర్కౌటవకుంటే… 5 కోట్లు డబ్బిచ్చి తర్వాత పెళ్లి చేసుకున్న… రెండో భార్యకు మిగతా ఆస్తి ఇచ్చి విడాకులిచ్చి మూడో పెళ్లి చేసుకున్నా.. సన్నాసుల్లారా.. అంటూ తీవ్ర విమర్శలు చేశారు పవన్ కల్యాణ్…

ఒకర్ని పెళ్లి చేసుకొని 30 స్టెప్నీలతో తిరిగి ఎదవల్లారా… చొక్కపట్టుకొని బయటకు లాక్కొచ్చి కొడతానంటూ హెచ్చరించారు. సభ్యత సంస్కారమని మూసుకు కూర్చున్నాం… కానీ శిక్షా ధర్మమే పనిచేస్తుందన్నారు. ఎన్నిసార్లు తిట్టినా భరించా.. వైసీపీలో పద్దతిగా ఉన్నవాళ్లను వదిలేస్తున్నా.. బూతుల పంచాంగం తిట్టే ప్రతి కొడక్కూ ఇదే.. నుంచో బెట్టి తోలు వలుస్తా కొడకల్లారా అంటూ చెలరేగిపోయారు. నాకు రాజకీయం తెలియదనుకుంటున్నారా.. అవకాశవాద రాజకీయాలు.. క్రిమినల్ రాజకీయాలు చేస్తారా… బలమైన సిద్ధాంతం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నా.. సై ఈ రోజు నుంచి… కొడకల్లారా… మీరు యుద్ధం చెప్పండ్రా.. మీరు చెప్పండ్రా… రాడ్లా, హాకీ స్టిక్కులు, రాళ్లా, ఒట్టి చేతులా దేనికైనా రెడీ.. మీరు రండి.. ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో.. చాలెంజ్ చేసి చెబుతున్నా.. రండి కొడకల్లారా.. తోలు తీస్తా ఒక్కోనా కొడుకు ఎక్కువ మాట్లాడితే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ మంచితనం, సహనం చూశారన్నారు.. సహృదయం చూశారు.. భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన హక్కును ఈ విధంగా స్వేచ్ఛగా ప్రకటిస్తున్నా… ఈ రోజు నుంచి యుద్ధమే మీరు రెడీనా అంటూ కార్యకర్తలకు పవన్ పిలుపిచ్చారు… యుద్ధం ఎక్కడ్నుంచి వచ్చిందంటే.. కడపు కాలితే పోరాటం చేస్తే యుద్ధం.. నా గుండెల్లో ఎలా ప్రవేశించిందంటే.. తెలంగాణ నుంచి వచ్చింది పోరాటమని చెప్పుకొచ్చారు.

గత ఎనిమిదేళ్లలో 6 సినిమాల్లో నటించగా 120 కోట్లు సంపాదించానన్నారు. 33 కోట్లకు పైగా పన్నులు కట్టానన్నారు. పిల్లల పేరుతో ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్లను పార్టీ కార్యాలయం కోసం ఖర్చు చేశానన్నారు. రెండు రాష్ట్రాల్లో సీఎం సహాయ నిధికి 12 కోట్లు, అయోధ్య రామాలయానికి 30 లక్షలు ఇచ్చానని చెప్పారు పవన్ కల్యాణ్… పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 15.58 లక్షల పార్టీ ఫండ్ వచ్చిందన్నారు. కౌలు భరోసా యాత్ర కోసం మూడున్నర కోట్లు వచ్చాయన్నారు. నా సేన కోసం నా వంతుకు 4 కోట్లు విరాళాలు వచ్చాయన్నారు పవన్ కల్యాణ్.