దిల్లీకి పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిల్లీకి బయలుదేరనున్నారు. నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం అనంతరం సాయంత్రం 6.30 నుండి 7గంటల సమయంలో హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కాబోతున్నారు. ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై అమిత్‌షాతో చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ ప్రారంభమయ్యింది. ఈ సమావేశంలో పూర్తి స్థాయి బడ్జెట్ గురించిన చర్చ జరగనుంది. నూతన క్రీడా విధానం, సెమీ కండక్టర్ పాలసీ, ప్రభుత్వ ఉద్యోగాలలో స్పోర్ట్స్ కోటా వంటి అంశాలు చర్చించే అవకాశముంది.

